IBPS RRB Clerk Prelims Result 2024: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) త్వరలో IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2024ని విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేయడానికి, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి. IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 10, 17, 18, 2024 తేదీల్లో నిర్వహించబడింది. ఫలితాల ప్రకటన తరువాత, స్కోర్‌కార్డ్ మరియు కట్ ఆఫ్ మార్కులు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
Advertisement
Mains పరీక్ష వివరాలు
ప్రిలిమ్స్ ఫలితాలలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబర్ 6, 2024న జరగబోయే మెయిన్స్ పరీక్షకు హాజరవుతారు. ఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు తుది ఎంపికలోకి ప్రవేశిస్తారు. మెయిన్స్ ఫలితాల ఆధారంగా తుది నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
Advertisement
IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం చాలా సులభం. కింది సూచనలను అనుసరించండి:
- ఆధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inలోకి వెళ్లి ‘IBPS RRB Clerk Prelims Result 2024’ లింక్ పై క్లిక్ చేయండి.
- తమ వివరాలను నమోదు చేయండి: రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి: స్క్రీన్ పై ఫలితాలు చూపిన వెంటనే, ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భద్రంగా ఉంచుకోండి.
IBPS RRB క్లర్క్ ఫలితాలు 2024
ఫలితాల ప్రకటన తర్వాత, అభ్యర్థులు తమ స్కోర్‌కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డులో విభాగాలవారీగా స్కోర్లు, మొత్తం మార్కులు ఉంటాయి. ఫలితాలను డౌన్‌లోడ్ చేసిన విధంగా, స్కోర్‌కార్డు కూడా డౌన్‌లోడ్ చేయవచ్చు.
IBPS RRB క్లర్క్ 2021 కట్ ఆఫ్ మార్కులు
ఇక్కడ 2021 సంవత్సరానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల కట్ ఆఫ్ మార్కులు ఇవ్వబడ్డాయి. ఇవి జనరల్, OBC, EWS కేటగిరీలకు వేరుగా ఉంటాయి.
రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం | జనరల్ కేటగిరీ | OBC కేటగిరీ | EWS కేటగిరీ |
---|---|---|---|
ఆంధ్ర ప్రదేశ్ | 69.25 | 69.25 | 69.25 |
అస్సాం | 71 | – | – |
బీహార్ | 73 | 73 | – |
చత్తీస్‌గఢ్ | 71 | – | – |
గుజరాత్ | 76.75 | 76.75 | – |
హర్యానా | 75.75 | – | – |
హిమాచల్ ప్రదేశ్ | 74.25 | – | – |
జమ్ము & కాశ్మీర్ | 72 | – | – |
జార్ఖండ్ | 76.25 | 76.25 | – |
కర్ణాటక | 70.75 | 70.75 | – |
కేరళ | 77 | – | – |
మధ్య ప్రదేశ్ | 73.75 | 73.75 | – |
మహారాష్ట్ర | 72.75 | 72.75 | – |
ఒడిషా | 78.5 | – | – |
పంజాబ్ | 76.5 | – | – |
రాజస్థాన్ | 76.75 | 76.75 | – |
తమిళనాడు | 70.5 | 70.5 | – |
తెలంగాణ | 69 | 69 | 69 |
ఉత్తర ప్రదేశ్ | 76.5 | 76.5 | 76.5 |
ఉత్తరాఖండ్ | 77.5 | – | – |
పశ్చిమ బెంగాల్ | 75.75 | – | – |
క్లర్క్ ప్రిలిమ్స్ స్కోర్‌కార్డు 2024 ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్: ibps.in ఓపెన్ చేసి స్కోర్‌కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
- వివరాలను నమోదు చేయండి: అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- స్కోర్‌కార్డు డౌన్‌లోడ్: స్కోర్‌కార్డు స్క్రీన్ పై కనిపించిన తర్వాత, దాన్ని డౌన్‌లోడ్ చేసి భద్రంగా ఉంచుకోండి.
LIVE UPDATE
IBPS RRB Clerk Result Direct Link
IBPS RRB Clerk Result Direct Link: Click Here
IBPS RRB Clerk Result Direct Link : Live updates
Direct official IBPS link: Click Here
LIVE: IBPS RRB Clerk Result 2024 Release date
IBPS RRB క్లర్క్ ఫలితాలు 2024 ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది, ఇది IBPS RRB PO మరియు క్లర్క్ 2024 పరిక్ష నోటిఫికేషన్ ప్రకారం. అయితే, ఫలితాల ప్రకటనా తేదీ ఇంకా నిర్దేశించబడలేదు.
Advertisement